: సూర్యను మమ్ముట్టి 'ఛాలెంజ్' చేస్తే... మహేష్ బాబుకు సూర్య 'సవాలు' విసిరాడు!


సినిమా హీరోలలో దాగున్న సామాజిక బాధ్యతను 'ఛాలెంజ్'లు వెలికి తీస్తున్నాయి. తాజాగా హాలీవుడ్, బాలీవుడ్ హీరోలను 'ఐస్ బకెట్ ఛాలెంజ్' ఓ ఊపు ఊపేయగా, అది భారతీయ వాతావరణానికి సరికాదని గ్రహించిన సెలబ్రిటీలు దానిని మరీ గుడ్డిగా అనుసరించలేదు. దాని స్ఫూర్తిగా 'రైస్ బకెట్ ఛాలెంజ్' ను సామాజిక బాధ్యతగా స్వీకరించి, అనుసరించారు. తాజాగా దేశంలో హరిత విప్లవం నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టే దిశగా 'మై ట్రీ ఛాలెంజ్' అంటూ కొత్త ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి 'మై ట్రీ ఛాలెంజ్' స్వీకరించి మరో ముగ్గురు సూపర్ స్టార్లను ఈ చాలెంజ్ కు నామినేట్ చేశాడు. దీంతో, ఆ ఛాలెంజ్ స్వీకరించిన సూర్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ను, శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ ను 'మై ట్రీ ఛాలెంజ్' కు నామినేట్ చేశాడు. అయితే, సూర్య సవాలును మహేష్ బాబు స్వీకరిస్తాడో లేదో చూడాలి!

  • Loading...

More Telugu News