: ఆ ముగ్గురు పార్టీ అధినేతలకు విజయానందం


ఉప ఎన్నికల్లో మూడు పార్టీలకు తలలుగా భాసిల్లుతున్న ముగ్గురు నేతలు తమ పార్టీ అభ్యర్థులకు విజయం సాధించిపెట్టి తమ ఛరిష్మాను చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించి అత్యున్నత పదవులనధిష్ఠించిన ప్రధాని నరేంద్ర మోడీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాము ఖాళీ చేసిన స్థానాల్లో తమవారిని గెలిపించుకుని సత్తాచాటారు. సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని వడోదరలో రెండో స్థానంగా పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆ స్థానంలో రాజీనామా చేయడం తెలిసిందే. అక్కడ జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ ఘనవిజయం సాధించారు. ఇక ఉత్తరప్రదేశ్ లో మెయిన్ పురి లోక్ సభ స్థానంలో బీజేపీ హవాను తట్టుకుని సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం విశేషం. దీంతో, ములాయం తమ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు పెరిగినా తన ఛరిష్మా తగ్గలేదని ఆయన నిరూపించుకున్నారు. ఇక, మెదక్ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన కేసీఆర్, అటు ఎమ్మెల్యేగానూ గెలిచారు. తమ పార్టీ నెగ్గడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థే విజయం సాధించారు. దీంతో, ఆయన తన ప్రతిభకు తిరుగులేదని మురిసిపోతున్నారు.

  • Loading...

More Telugu News