: ఈ మహిళా సాకర్ టీమ్ ఓడినా బోనస్ ఇచ్చారు!
థాయ్ లాండ్ మహిళా ఫుట్ బాల్ జట్టు ఓటమిపాలైనా నజరానా దక్కించుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే... దక్షిణకొరియా నగరం ఇంచియాన్ వేదికగా ఆసియా క్రీడల సాకర్ పోటీలను కాస్త ముందే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, థాయ్ జట్టు తొలి మ్యాచ్ లోనే 0-5తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. గెలిస్తే రూ.3.7 లక్షలు నజరానాగా ఇద్దామనుకున్నామని థాయ్ లాండ్ ఫుట్ బాల్ అసోసియేషన్ హెడ్ వొరావి మకుదీ చెప్పారు. అయితే, పోరాడి ఓడారన్న కారణంతో అందులో సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించామని ఆమె తెలిపారు.