: నటుడు కమల్ హాసన్ కు స్వల్ప అస్వస్థత
ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్ధతకు గురయినట్లు సమాచారం. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో కలుషిత ఆహారం తీసుకోవడంతో ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కమల్ చికిత్స పొందుతున్నారు. అయితే, వెంటనే కోలుకుంటారని, రేపు డిశ్చార్జయి యథావిధిగా షూటింగులో పాల్గొంటారని కమల్ సన్నిహితులు చెబుతున్నారు.