: నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: తంగిరాల సౌమ్య
కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ స్థానం ఉపఎన్నికలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తన విజయానికి సహకరించిన వారందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని తన తండ్రి ప్రభాకరరావుకు ప్రజలు ఇచ్చిన నివాళిగా భావిస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తనకు తోడుగా నిలిచిన జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఓటేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి, నందిగామను అభివృద్ధిపథంలోకి తీసుకెళతానని పేర్కొన్నారు. గెలుస్తానని ముందే అనుకున్నా, ఇంతటి భారీ విజయం ఊహించలేదన్నారు.