: 'నందిగామ'లో ఘనవిజయం సాధించిన టీడీపీ... డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్
నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె 74,827 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. చివరి రౌండ్లలో కాస్త పుంజుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు కష్టపడి డిపాజిట్ దక్కించుకోగలిగారు.