: మెదక్ ఉపఎన్నిక... 65వేల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ గుబాళిస్తోంది. ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 65,597 ఓట్ల ఆధిక్యతను సాధించారు. లెక్కింపులో ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు 1,00,288 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి 34,691 ఓట్లు... బీజేపీ అభ్యర్థి 24,547 ఓట్లు సాధించారు.