: వందరోజుల పాలన మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి చంద్రబాబు సీక్రెట్ సర్వే!
రేపటితో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ వంద రోజుల పాలన పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని... తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఓ సీక్రెట్ సర్వేను చేయిస్తున్నారు. ఈ బాధ్యతను తనయుడు నారా లోకేష్ కు ఆయన అప్పజెప్పారు. టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. దీని కోసం 40 ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాన్ని లోకేష్ టీం రెడీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని సగం జిల్లాల్లో సర్వే పూర్తయ్యింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా సర్వే పూర్తవుతుంది. సర్వే డేటాను కంప్యూటర్ లో ఫీడ్ చేసి... దాని ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చంద్రబాబు 'వన్ టు వన్' మీటింగ్ జరుపుతారు. నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేల పనితీరు, వారి ఇమేజ్ తో పాటు... ప్రభుత్వ పథకాలను వారు ఎంతమేరకు ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతున్నారు? తదితర విషయాలను ఈ సర్వే ద్వారా అంచనా వేస్తారు.