: మూడు గంటలుగా కొనసాగుతున్న ఏపీ 'ఇ-కేబినెట్' సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఇ-కేబినెట్ సమావేశం లేక్ వ్యూ అతిథి గృహంలో మూడు గంటలుగా కొనసాగుతోంది. దేశంలోనే తొలిసారిగా కాగితరహితంగా జరుగుతున్న ఈ భేటీలో ఐపాడ్ లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో పథకాలపై చర్చిస్తున్నారు. వంద రోజుల పాలనపై మంత్రులతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలు, రుణాల మాఫీకి దశలవారీగా నిధుల విడుదల, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది.