: చైనాలో భారీ వర్షాలకు 19 మంది మృతి


చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, ఇప్పటివరకు పందొమ్మిది మంది మరణించారు. వరదల కారణంగా 20కి పైగా గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో 12 మంది చాంగ్ జింగ్ నగరవాసులు కాగా, ముగ్గురు పొరుగున ఉన్న సిచువాన్ రాష్ట్రానికి, మరో నలుగురు షాంగ్జీ ప్రావిన్స్ కు చెందినవారని స్థానిక మీడియా తెలిపింది. వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతాయన్న సూచనతో దాదాపు వేల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • Loading...

More Telugu News