: కాంగ్రెస్ కార్యకర్తలే పొన్నాల లక్ష్మయ్య గోచీ ఊడగొడతారు: జగదీష్ రెడ్డి


తెలంగాణ పీసీసీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను విమర్శించే కనీస అర్హత పొన్నాలకు లేదన్నారు. త్వరలో పొన్నాల లక్ష్మయ్య గోచీని కాంగ్రెస్ వాళ్లే ఊడగొడతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ప్రజలు తరిమి కొడతారని పొన్నాల అంటున్నారని... వాస్తవానికి కాంగ్రెస్ కార్యకర్తలే పొన్నాల గోచీ ఊడగొట్టేందుకు రెడీ అవుతున్నారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌ తన వందరోజుల పాలనలో ఏ అభివృద్ధీ చేయలేదని ఆరోపిస్తున్న పొన్నాల... తన రాజకీయ జీవితం ఆసాంతం... ఆంధ్రావాళ్ల కాళ్లు మొక్కి పదవులు కాపాడుకున్నాడని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News