: నేడు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై తుది జాబితా వెలువడనున్న రోజే గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. మరోవైపు మీడియాపై తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు చేసిన పరుష వ్యాఖ్యలను కూడా కేంద్రంతో భేటీ సందర్భంగా గవర్నర్ ప్రస్తావించే అవకాశాలున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో మేమేం చేస్తామో చూస్తారంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న గవర్నర్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.