: రేపు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్


ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీ వెళుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్, మోడీకి వివరించనున్నారు. అంతేకాక తెలంగాణ సీఎం కేసీఆర్, మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 చానెళ్ల ప్రసారాల నిలిపివేత తదితర అంశాలు కూడా మోడీతో భేటీలో ప్రస్తావించేందుకు గవర్నర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా, రెండు రోజుల్లో ఏం చేస్తామో చూస్తారంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

  • Loading...

More Telugu News