: విమోచన దినోత్సవం నాడు కేసీఆర్ తెలంగాణ జెండాను గోల్కొండపై ఎగురవేయాలి: కె.లక్ష్మణ్
తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్... విమోచన దినోత్సవం నాడు తెలంగాణ జెండాను కూడా అదే కోటపై ఎగురవేయాలని ఆయన సూచించారు. ఒక వేళ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే... బీజేపీ తరపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. మెదక్ ఉపఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం... ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం అజెండాను పక్కాగా అమలు చేస్తోందని ఆయన విమర్శించారు.