: మదార్సాలలో ఉగ్రవాదాన్ని బోధిస్తున్నారు: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్


మదార్సాలు ఉగ్రవాద బోధనాలయాలుగా మారాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా నాదేమావ్ లో ఆదివారం పర్యటించిన సందర్భంగా ఉన్నవ్ ఎంపీ మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మదార్సాలలో ఉగ్రవాద పాఠాలను బోధిస్తున్నారు. విద్యార్థులను ఉగ్రవాదులుగానూ, జిహాదీలుగానూ మారుస్తున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదే’’ అని ఆయన ఆరోపించారు. మత బోధనలు చేసే పాఠశాలలు, చిన్నారులకు దేశభక్తిని బోధించడం మానేశాయని ఆయన ఆరోపించారు. ‘‘ఆగస్ట్ 15, జనవరి 26 సందర్భంగా ఏ ఒక్క మదార్సాలలోనైనా త్రివర్ణ పతాకం ఎగురుతుందా?’’ అని కూడా ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News