: లోక్ సత్తా అధ్యక్ష పదవికి జయప్రకాష్ నారాయణ రాజీనామా?
లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి జయప్రకాష్ నారాయణ రాజీనామా చేయనున్నారని లోక్ సత్తా పార్టీ వర్గాలు అంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో... రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని జయప్రకాష్ నారాయణ స్వయంగా తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.