: 'హైన్స్' హత్యపై ఒబామా స్పందన
బ్రిటీష్ జాతీయుడు డేవిడ్ హైన్స్ ను ఐఎస్ఐస్ గ్రూపు చంపేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. మిలిటెంట్ల దురాగతాన్ని 'అటవిక చర్య' అని పేర్కొన్నారు. హైన్స్ కుటుంబం, బ్రిటన్ ప్రజల పట్ల తాము ఎంతో విచారిస్తున్నామని తెలిపారు. ఇక, తమ మిత్రదేశం బ్రిటన్ తో చేయి చేయి కలిపి టెర్రరిస్టు వేటలో ముందుకు సాగుతామని అన్నారు. బ్రిటన్ తోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కలిసి వచ్చే దేశాల సంకీర్ణం సాయంతో మిలిటెంట్లను తుదముట్టిస్తామని ఒబామా స్పష్టం చేశారు.