: ఇతగాడు ఫోన్ వేధింపుల స్పెషలిస్ట్!
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో ఓ వ్యక్తి (35) మహిళలను ఫోన్ లో వేధిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతగాడు 18 నెలల కాలంలో సుమారు 200 మంది మహిళలను వేధింపులకు గురిచేసినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడం, లేదా, ఎస్సెమ్మెస్ ద్వారా అశ్లీల సందేశాలు పంపడం చేసేవాడు. ఓ మహిళ ఫిర్యాదు నేపథ్యంలో అతని ఫోన్ పై నిఘా పెట్టిన పోలీసులు, మయూర్ నగర్లో ఉన్న అతడి నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఏదో ఒక నెంబర్ కి ఫోన్ చేయడం, అవతలివైపు మహిళ ఎత్తితే చాలు, ఆ నెంబర్ కు అదేపనిగా ఫోన్ కాల్స్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన మహిళలతో వెకిలిగా మాట్లాడి వేధించడం ఇతడి నైజం. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.