: మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మెజార్టీ బాగా తగ్గుతుంది: దత్తాత్రేయ


మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ మెజార్టీ భారీగా తగ్గనుందని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. గతంలో వచ్చిన మెజార్టీలో సగం కూడా ఈసారి టీఆర్ఎస్ కు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉపఎన్నికలో, బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిందని...ఆ మేరకు తాము సఫలమయ్యామని అన్నారు. ఫలితాలు రాకముందే టీఆర్ఎస్ మెజార్టీ తగ్గుతుందని వ్యాఖ్యానించడం ద్వారా మెదక్ ఉపఎన్నికలో ఓటమిని బీజేపీ ముందే ఒప్పుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News