: 'మోడీ జ్ఞాపకశక్తి అదుర్స్' అంటున్న టెన్నిస్ క్వీన్
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన టెన్నిస్ తార సానియా మీర్జా ఆయన జ్ఞాపకశక్తి అద్భుతమని కితాబిస్తోంది. తన సోదరి ఆనమ్ ఇంతకుముందు అహ్మదాబాద్ లో షూటింగ్ పోటీల్లో పాల్గొన్న సందర్భంగా అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని కలిసిందని, ఆ విషయాన్ని మోడీ ఇప్పటికీ గుర్తుంచుకున్నారని, ఆనమ్ ఎలా ఉందని అడిగారని సానియా తెలిపింది. ఇక, బిజీ షెడ్యూల్ లో సైతం ప్రధాని తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడంపై సానియా సంతోషం వ్యక్తం చేసింది. యూఎస్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకు అభినందనలు తెలిపారని చెప్పింది. తాను నిర్వహిస్తున్న టెన్నిస్ అకాడమీ వివరాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారని సానియా తెలిపింది.