: మోడీ బర్త్ డేకి మెను సిద్ధం చేసిన తల్లి హీరాబా


భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న 64వ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. ప్రతి జన్మదినోత్సవం నాడు మోడీ తన తల్లి హీరాబా (95) ఆశీస్సులు అందుకోవడం రివాజుగా వస్తోంది. పుట్టినరోజు నాడు మోడీ తన వద్దకు వస్తాడని తెలిసిన ఆ తల్లి మిఠాయిలు సిద్ధం చేసింది. గుజరాతీ స్పెషల్స్ అయిన చుర్మా కె లడ్డూ, లాప్సీ, కన్సార్ తదితర వంటకాలను ఆయనకు తినిపించాలని హీరాబా ఎదురుచూస్తోందని గుజరాత్ వర్గాలు తెలిపాయి. హీరాబా ప్రస్తుతం మోడీ సోదరుడు పంకజ్ వద్ద ఉంటోంది.

  • Loading...

More Telugu News