: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి విచ్చేస్తున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తన సొంత గ్రామమైన చింతమడకకు ఈరోజు రానున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కేసీఆర్ వస్తుండడంతో గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ గ్రామంలోకి అడుగుపెట్టిన తర్వాత దారి పొడవునా ఆయనపై పూలు చల్లే విధంగా గ్రామస్థులు ఏర్పాట్లు చేశారు. మెదక్ ఉపఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకుగాను స్వగ్రామానికి కేసీఆర్ ఈ రోజు విచ్చేస్తున్నారు.