: ఎన్టీఆర్ కు భారతరత్న: కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఏపీ సర్కార్
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు భాషకు... తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన మహనీయుడు ... వెండితెర వేలుపుగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన దివంగత నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతోపాటు... సుమారు 30 మంది తెలుగు ప్రముఖులకు ‘పద్మ’ పురస్కారాలు ఇచ్చి వారి సేవలను గుర్తించాల్సిందిగా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘పద్మ’ పురస్కారాల కోసం నటుడు కోట శ్రీనివాసరావు, పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, ప్రముఖ వైద్యుడు జి.నాగేశ్వర్ రెడ్డి, తిరుపతిలోని ‘బర్డ్’ ఆస్పత్రికి చెందిన డాక్టర్ జగదీశ్ తదితరుల పేర్లను ఏపీ సర్కార్ ప్రతిపాదించినట్లు సమాచారం.