: మీడియాపై నేను ఒక్కమాట కూడా తప్పుగా మాట్లాడలేదు: గవర్నర్ తో కేసీఆర్


మీడియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌.. తన వ్యాఖ్యలను గవర్నర్‌ నరసింహన్‌ వద్ద సమర్థించుకున్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తొలుత పరిపాలనపరమైన అంశాలను ఆయన గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తనంతట తానే మీడియాపై చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దగ్గర కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్లు, తెలంగాణ సమాజాన్ని గౌరవించాలనే కోణంలోనే ఆరోజు తాను అలా మాట్లాడానని ఆయనకు చెప్పారు. తెలంగాణ గడ్డపై ఉండాలని అనుకుంటున్నప్పుడు, ఇక్కడి ప్రజలను అవమానించకూడదనే దృక్పథంతోనే తాను మాట్లాడానని... కావాలనే మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని కేసీఆర్ గవర్నర్ కు స్పష్టం చేశారు. తాను అసలు ఒక్క మాట కూడా తప్పుగా గా మాట్లాడలేదని... నెగటివ్ గా కూడా మాట్లాడలేదని ఆయన గవర్నర్ వద్ద తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ 9 ప్రసారాల నిలిపివేత నిర్ణయం ఎమ్మెస్వోలు తీసుకున్నారని, ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. ఏదైనా ఉంటే ఆ చానళ్ల యాజమాన్యాలు కేబుల్‌ ఆపరేటర్లతో చర్చించుకోవాలని, ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన విషయాలు గవర్నర్ మౌనంగా విని ఊరుకున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News