: నిర్ణయం మార్చుకున్న సానియా మీర్జా... ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు సై!


ఆసియా క్రీడల్లో పాల్గొనాలని ఇండియన్ టెన్సిస్ స్టార్ సానియా మీర్జా నిర్ణయించుకుంది. వాస్తవంగా.. కొన్ని రోజుల క్రితం ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సానియా మీర్జా నిరాకరించింది. ఈనెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే, ఇదే సమయంలో పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా జరుగుతుండడంతో... ఈ టోర్నమెంట్లలో పాల్గొని తన ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకోవాలని సానియా ముందుగా నిశ్చయించుకుంది. సానియా నిర్ణయానికి ఆల్ ఇండియా టెన్నిస్ ఆసోసియేషన్ (ఏఐటీఏ) కూడా అంగీకారం తెలిపింది. ఆమె నిర్ణయంతో ఆసియా క్రీడల్లో భారత్ కు టెన్నిస్ పతకం కష్టమేనని క్రీడాభిమానులు భావించారు. అయితే హఠాత్తుగా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన నిర్ణయాన్ని మార్చుకుని ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు సానియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదన్న తన నిర్ణయం తనకే నచ్చలేదని...దేశం కోసం ఆసియా క్రీడల్లో పాల్గొంటానని సానియా వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల్లో పతకం గెలవడం అంత తేలిక కాదని...అయితే తన ప్రయత్నం తాను చేస్తానని సానియా తెలిపింది.

  • Loading...

More Telugu News