: అక్రమ నిర్మాణం విషయంలో షారుఖ్ ఖాన్ పై కేసు నమోదు


బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పై ముంబైలోని బాంద్రా కోర్టులో కేసు నమోదయ్యింది. ముంబైలో తన నివాసమైన 'మన్నత్' పక్కన షారుఖ్ అక్రమంగా ఓ ర్యాంప్ ను నిర్మించుకున్నారని గత కొన్ని రోజులుగా వివాదం నలుగుతోంది. ఈ వివాదంపై సామాజిక కార్యకర్త నికోలాస్ అల్మీదా బాంద్రా కోర్టులో షారుఖ్ కు వ్యతిరేకంగా కేసు వేశారు. మన్నత్ ను ఆనుకుని షారుఖ్ నిర్మించిన అక్రమ కట్టడంపై కోర్టుకు ఫిర్యాదు చేశామని, వచ్చె నెల విచారణకు రానుందని నికోలాస్ అల్మీదా తరపు న్యాయవాది వివియన్ డిసౌజా వెల్లడించారు. ఈ కేసులో షారుఖ్ తో పాటు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ను... మరో ముగ్గురు అధికారులను ప్రతివాదులగా చేర్చారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన ఈ కట్టడాన్ని తొలగించాలని పలువురు అధికారులను తాను అనేకమార్లు కలిశానని... అయితే వారి వద్ద నుంచి స్పందన పూర్తిగా కొరవడడంతో కోర్టును ఆశ్రయించానని అల్మీదా తెలిపారు.

  • Loading...

More Telugu News