: చానళ్ల ప్రసారాల నిలిపివేత విషయంలో టీఎస్ సర్కార్ సరిగ్గానే వ్యవహరించింది: కవిత
టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేత విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఏమాత్రం వెనక్కి తగ్గేట్టు కనపడటం లేదు. తాజాగా ఈరోజు నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టీవీ9, ఏబీఎన్ చానళ్ల నిలిపివేత విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గానే వ్యవహరించిందని ఆమె అన్నారు. అయినా ఈ విషయం... చానళ్ల యాజమాన్యానికి, ఎమ్మెస్వోలకు సంబంధించిందని... దాంతో ప్రభుత్వానికి అసలు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ కేసీఆర్ ను విమర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు. కట్జూ...ఓ రిటైర్జ్ జడ్జ్ అని...ఆయన అన్నీ తెలుసుకుని స్పందించాలని కవిత సూచించారు.