: ప్రేయసి హత్య కేసులో దోషిగా పిస్టోరియస్


ప్రేయసి, మోడల్ రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ ను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు దోషిగా తేల్చింది. ఇదే కేసులో అతనిపై నమోదైన శిక్షార్హమైన అభియోగాలను పరిశీలించిన జడ్జి థకోజిల్ మసిపా, పిస్టోరియస్ గన్ ఉపయోగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, స్టీన్ క్యాంప్ మరణానికి కారకుడయ్యాడని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 13న కోర్టు అతనికి శిక్షను ఖరారు చేస్తుంది. ఇదే సమయంలో పిస్టోరియస్ బెయిల్ గడువును కోర్టు పెంచింది. అయితే, పదిహేనేళ్ల జైలు శిక్షపడే అవకాశముందని తెలుస్తోంది. కాగా, నిన్న (గురువారం) ఇదే కేసులో ప్రేయసిన రీవాను అతడు ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదన్న కోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News