: జర్నలిస్టులను చల్లబరిచేందుకు తెలంగాణ సర్కారు 'ఉచిత' నిర్ణయం!


టీవీ9, ఏబీఎన్ చానళ్ళ ప్రసారాల నిలిపివేత నేపథ్యంలో తెలంగాణ సర్కారు నష్టనివారణ చర్యలను మరో వైపు నుంచి మొదలు పెట్టింది. ఆ రెండు చానళ్ళపై అవలంబిస్తున్న కఠిన వైఖరితో మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పాత్రికేయులను చల్లబరిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ 'ఉచిత' నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో పనిచేసే పాత్రికేయుల పిల్లలకు ఇకపై ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే కొన్ని జర్నలిస్టు యూనియన్లు విద్యాశాఖకు లేఖ రాశాయి. హైదరాబాదులో విద్యాభ్యాసం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, తమ ఆదాయాలతో పోల్చితే అది పెనుభారమేనని వారు తమ లేఖలో పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం కింద ఉచిత విద్య అవకాశం కల్పించాలని వారు సర్కారుకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News