: కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది. వాస్తును విశేషంగా నమ్మే కేసీఆర్ తనకు నలుపు రంగు అచ్చిరాదని భావించి కాన్వాయ్ రంగు మార్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిన అధికారులు మూడు నలుపు రంగు ఫార్చ్యూనర్ కార్లను తెలుపు రంగులోకి మార్చారు. పనిలో పనిగా పోలీసుల వాహనాలను కూడా తెలుపు రంగులోకి మారుస్తున్నారు.