: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన నేడే


మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ ప్రకటించనుంది. వాస్తవానికి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, రెండు దశల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారట. మొదటి దశలో హర్యానా, మహారాష్ట్ర, రెండో దశలో జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరపనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. అక్కడ కూడా అదే విజయాన్ని తిరిగి పొందాలని చూస్తున్న పార్టీ సీనియర్ నేతలు అప్పుడే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారట.

  • Loading...

More Telugu News