: 3 లక్షల దొంగనోట్లు దొరికాయి
ఒడిశాలోని బరంపురం గుసాని నువాగామ్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ నోట్లు దొరకగా, ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్ల తయారీ యంత్రాలు, రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా వీరు నకిలీ నోట్లను తయారు చేస్తూ చలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై నిఘా ఉంచి పకడ్బందీగా దాడులు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.