: సల్మాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?


కాస్త తిక్క ఉన్నా లెక్క ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చుట్టూ ఉచ్చుబిగుస్తోందా? 1998లో చేసిన తప్పుకు శిక్ష పడుతుందా? అంటే పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ కు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సాక్షాత్తూ సల్మాన్ ఖాన్ తాను అత్యధిక ఆదాయపు పన్ను కట్టేవారి జాబితాలో ఉన్నాను, ఎన్నో ధార్మిక సంస్థలకు ప్రధాన పోషకుడిని, తన వృత్తి ద్వారా ఎన్నో కుటుంబాలు పోషించబడుతున్నాయని, పలు దేశాల మధ్య సాంస్కృతిక రాయబారిగా ఉంటూ దేశానికి తన వంతు సేవ చేస్తున్నానని సల్లూభాయ్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపాడు. దీంతో, చట్టం ముందు అందరూ సమానమే, న్యాయానికి అసమానతలుండవని కోర్టు స్పష్టం చేసింది. సల్మాన్ కు ఇచ్చే మినహాయింపు ఇంకో నేరస్తుడికి అవకాశం కల్పించేదిగా ఉండరాదని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను చూస్తే సల్మాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News