: ముఖ్యమంత్రికే కరెంటు లేదు...!
సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికే కరెంటు లేదంటే జమ్మూకాశ్మీర్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జమ్మూకాశ్మీర్ లో వరదలు విలయతాండవం చేయడంతో అక్కడ జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆహార రవాణా, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా వరదల తాకిడికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ప్రభుత్వం లేదని, వరదలతో రాష్ట్రం అంతా స్తంభించిందని అన్నారు. ప్రస్తుతం తన ఇంట్లో కూడా విద్యుత్ సమస్య ఉందని, చివరకు తన సెల్ ఫోన్ కూడా పని చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 36 గంటల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆయన తన గెస్ట్ హౌస్ నే సచివాలయంగా ఉపయోగించుకుంటున్నారు.