: జగ్గారెడ్డిని గెలిపించి టీఆర్ఎస్ కు షాకివ్వండి: కిషన్ రెడ్డి
మెదక్ ఉపఎన్నికల్లో జగ్గారెడ్డిని గెలిపించి టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. మెదక్ జిల్లా గజ్వేల్ లో ప్రచారం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో దోషిగా నిలబడిందని అన్నారు. కేసీఆర్ కు మెదక్ ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.