: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్ కు ఊరట


ఆర్టిఫిషియల్ కాళ్ళతో వేగంగా పరిగెత్తి క్రీడా ప్రపంచాన్ని అబ్బురానికి గురి చేసిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ కు ప్రియురాలి హత్య కేసులో న్యాయస్థానం ఊరటనిచ్చింది. ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పిస్టోరియస్ ను ముద్దాయిగా నిర్ధారించే సరైన సాక్ష్యం లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించింది. దీంతో, పిస్టోరియస్ ఆనందంలో మునిగిపోయాడు. 2013లో ప్రేమికుల రోజున తన మోడల్ ప్రేయసి రీవా స్టీన్ క్యాంప్ ను ను ఒలింపియన్ పిస్టోరియస్ హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు పాఠం పూర్తిగా చదివేందుకు రెండు రోజులు పడుతుందని తెలిపిన న్యాయమూర్తి పిస్టోరియస్ ను నిర్దోషిగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News