: మెదక్ లో బీజేపీ-టీడీపీ కూటమిదే విజయం: ప్రకాశ్ జవదేకర్


మెదక్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జగ్గారెడ్డి గెలుపుకోసం కమలం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గెలిచి తీరుతామని నమ్మకంగా ఉన్నారు. ఈ మేరకు గజ్వేల్ లో ఈరోజు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, జగ్గారెడ్డిని మెదక్ స్థానంలో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డిని గెలిపిస్తే టీడీపీ నేత, గజ్వేల్ లో ఓటమిపాలైన ప్రతాపరెడ్డికి కూడా సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పారు. ఉపఎన్నికలో బీజేపీ-టీడీపీ కూటమి తప్పకుండా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అటు భవిష్యత్తులోనూ తమ కూటమే అధికారంలోకి వస్తుందని జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమకు రెండు కళ్లలాంటివని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ, మెదక్ అభ్యర్థి జగ్గారెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News