: అమెరికాను బెదిరించాలని చూస్తే పుట్టగతులుండవు: ఐఎస్ఐఎస్ కు ఒబామా వార్నింగ్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్లకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అమెరికాను బెదిరించాలని చూస్తే పుట్టగతులుండవని అన్నారు. 9/11 దాడులకు నేటితో 13 ఏళ్ళు నిండిన సందర్భంగా, జాతినుద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాక్ లో మరో యుద్ధానికి దిగబోమని, అమెరికాను సవాల్ చేస్తున్న మిలిటెంట్లను మాత్రం వేటాడతామని స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లది ఇస్లాం భావజాలం కాదని, ఏ మతం కూడా అమాయకులను చంపడాన్ని హర్షించదని ఒబామా అన్నారు. ఐఎస్ఐఎస్ ఓ దేశం కానేకాదని, అది, ఇంతకుముందు ఇరాక్ లో అల్ ఖైదా అనుబంధ సంస్థేనని తెలిపారు. దాన్ని ఏ ప్రభుత్వమూ, ప్రజలూ గుర్తించరని చెప్పారు.

  • Loading...

More Telugu News