: మూడు నెలల్లో 240 ప్రాజెక్టులకు 'జవదేకర్' శాఖ అనుమతులు
గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన ప్రాజెక్టులకు ప్రస్తుత ఎన్డీఏ సర్కారు చకచకా క్లియరెన్స్ ఇచ్చేస్తోంది. అందులో భాగంగానే మూడు నెలల పాలనలో పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కార్యాలయం 325 పెండింగ్ ప్రాజెక్టుల్లో 240 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందట. ఈ క్రమంలో, గత ప్రభుత్వంలో పర్యావరణ అనుమతుల జారీ అంశం ఏ స్థాయిలో మందగించిందో మంత్రిత్వశాఖ పత్రాలు చూపుతున్నాయి. అటు, వేగవంతంగా అనుమతులు ఇవ్వడంవల్ల రూ.2,00,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని, ఈ ఒరవడి ఆర్ధిక రంగం పుంజుకునేందుకు సహాయపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేగాక, త్వరిత క్లియరెన్స్ వల్ల కొత్త పెట్టుబడులు వస్తాయని, రోడ్లు, పవర్ ప్లాంట్స్, చమురు అన్వేషణ వంటి మౌలిక రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని కూడా కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.