: హత్య కేసులో నేడు తేలనున్న బ్లేడ్ రన్నర్ భవిష్యత్తు
దక్షిణాఫ్రికాకు చెందిన విశ్వ విఖ్యాత బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియన్ భవిష్యత్తు నేడు తేలనుంది. తన ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రిటోరియా హైకోర్టు నేడు తుది తీర్పును వెలువరించనుంది. ఒకవేళ పిస్టోరియనే ఈ హత్యకు పాల్పడ్డాడని తేలితే అతనికి కనీసం 15 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా జీవితఖైదు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.