: అమ్మాయిలను ఎరవేస్తారు... క్రికెటర్లూ జాగ్రత్త!: వరల్డ్ కప్ నేపథ్యంలో పోలీసుల హెచ్చరిక


వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో న్యూజిలాండ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మెగా ఈవెంట్ కు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, తమ గడ్డపై నిర్వహిస్తున్న టోర్నీలో అవినీతికి తావివ్వరాదని కివీస్ పోలీస్ గట్టిగా నిశ్చయించుకుంది. ఈ క్రమంలో క్రికెటర్లకు పలు హెచ్చరికలు జారీ చేశారు. వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా... ఆటగాళ్ళను ఫిక్సింగ్ రొంపిలో దింపడానికి అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారని టోర్నీ భద్రతాధిపతి సాండ్రా మాండెర్సన్ తెలిపారు. "టోర్నీలో ఆటగాళ్ళను బుట్టలో వేయడం కోసమని ఫిక్సర్లు, బుకీలు అతివలను న్యూజిలాండ్ తీసుకువస్తారని మాకు తెలుసు. ఫిక్సింగ్ కు సాయమపడమని వాళ్ళు అడుగుతారు. ఆటగాళ్ళు అందుకు తిరస్కరించాలి" అని మాండెర్సన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News