: ఆ గ్రామం పేరు 'స్నాప్ డీల్.కామ్ నగర్'


ఉత్తరప్రదేశ్ లోని శివ్ నగర్ ఓ కుగ్రామం. ఆ ఊరికి సరైన సదుపాయాలే కరవయ్యాయి. రోజుకు రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటుంది. తాగునీరు సరేసరి. మంచినీరు వారికి అపురూపమైన వస్తువు. అయితే, వారి కష్టాలను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ 'స్నాప్ డీల్.కామ్' తీర్చింది. గ్రామస్తుల నీటి అవసరాలు తీర్చేందుకు 15 చేతి పంపులను ఏర్పాటు చేసిందా సంస్థ. దీంతో, నీటి కోసం మైళ్ళకొద్దీ నడిచే బాధ తప్పిింది శివ్ నగర్ గ్రామస్తులకు. ఇంకేముందీ, శివ్ నగర్ కాస్తా 'స్నాప్ డీల్.కామ్ నగర్' అయిపోయింది. తమ కష్టాలు తీర్చిందన్న కారణంతో ఆ గ్రామవాసులు తమ ఊరికి సదరు సంస్థ పేరుపెట్టుకుని కృతజ్ఞత చాటుకున్నారు.

  • Loading...

More Telugu News