: జయ పరువునష్టం కేసులో సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు
ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువునష్టం కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న తమ ముందు హాజరుకావాలని అందులో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కొన్నిరోజుల కిందట స్వామి రాసిన లేఖలో తనపై ఆరోపణలు చేశారంటూ జయ ఈ కేసు వేశారు.