: ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న గ్రామస్థులు... 300 మంది పోలీసుల మోహరింపు
థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంబోడు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ గ్రామ పరిధిలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి తాము ఒప్పుకోమంటూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తండాలో దాదాపు 300 మంది పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో, తండావాసులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.