: హర్యానా ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల


హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం విడుదలైంది. 43 మందితో కూడిన ఈ తొలి జాబితాలో ఏడుగురు మహిళలతో పాటు 11 మంది యువకులకు చోటు దక్కింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమ్ లతా సింగ్ కు తొలి జాబితాలోనే టికెట్ దక్కడం విశేషం. రాష్ట్రంలోని ఉచ్చానా కలాన్ నియోజకవర్గం నుంచి ఆమెను ఎన్నికల బరిలోకి దింపేందుకు పార్టీ నిర్ణయించింది. ఛండీగఢ్ మాజీ మేయర్ జియాన్ చంద్ గుప్తాకు పంచ్ కుల సీటును కేటాయించింది. ఎన్నికల నోటిషికేషన్ విడుదలకు ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కాంగ్రెస్ కంటే తానే సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 27తో ముగియనున్న హర్యానా అసెంబ్లీకి తాజా ఎన్నికల కోసం ఈ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News