: మూడు నెలల విరామం తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వైఎస్ విజయమ్మ!


సార్వత్రిక ఎన్నికల తర్వాత... వైసీపీ గౌరవాధ్యక్షురాలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాకపోవడంతో పాటు... విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడం ఆమెను బాగా కుంగదీసిందని అప్పట్లో వైసీపీ వర్గాలు చెప్పుకున్నాయి. గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంపై కనపడకపోవడంతో వైఎస్ విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారేమోనన్న అనుమానాన్ని కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. ఆమెతో పాటు వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా ఎన్నికల తర్వాత వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, వైఎస్ విజయమ్మ ఇటీవల జరిగిన వైసీపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం ఆ పార్టీ వర్గాలకు ఊరటనిచ్చింది. ఈ సమావేశానికి హాజరుకావడంతో, ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ విజయమ్మ చురుగ్గా పాల్గొంటారని వైసీపీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పడు... పార్టీ వ్యవహారాలను విజయమ్మ సమర్థంగా చక్కబెట్టారని... ఆమె మళ్లీ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే పార్టీ బలపడుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News