: మిస్ ఫైరైన తుపాకీ... గాయపడ్డ ఏపీఎస్పీ కానిస్టేబుల్
ప్రమాదవశాత్తు తుపాకి మిస్ ఫైర్ కావడంతో 9వ బెటాలియన్ కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని అంకాలమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ఏపీఎస్పీ కూంబింగ్ పార్టీ బేస్ క్యాంప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణ ఛాతీ కింద భాగంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. గాయపడ్డ అతడిని వెంటనే 108 అంబులెన్స్ లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.