: అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సర్కారు సిద్ధం: గండ్ర
రాష్ట్ర సర్కారు మైనార్టీలో పడిందన్న విమర్శలు ఒట్టి ఊహగానాలేనని ప్రభుత్వ ఛీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కొట్టిపడేశారు. ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు, షర్మిల పాదయాత్రలు చేస్తున్నారని గండ్ర ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు ఎక్కువ మేలు జరిగిందన్న ఆయన..ఈ అంశంపై శాసనసభలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.