: భారత శాస్త్రవేత్తకు అత్యున్నత జీవ వైవిధ్య పురస్కారం


భారత పర్యావరణ వేత్త కమల్ జీత్ సింగ్ బవా ప్రతిష్ఠాత్మక మిడోరి జీవవైవిధ్యం పురస్కారానికి ఎంపికయ్యారు. 60 లక్షల రూపాయల విలువైన ఈ పురస్కారం ఆయన చేసిన విశిష్ట పరిశోధనలకు దక్కిన రివార్డుగా నిర్వాహకులు తెలిపారు. బోస్టన్ లోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో 40 ఏళ్లు ఆచార్యునిగా పని చేసిన బవా, పర్యావరణంపై, హిమాలయాల్లో వాతావరణ మార్పులపై పరిశోధనలు చేశారు. జపాన్ లోని ఏఇఓఎన్ పర్యావరణ సంస్థ 2010 నుంచి మిడోరి జీవ వైవిధ్యం అవార్డు ఇవ్వడం ప్రారంభించింది. వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరుగనున్న ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్, పీహెచ్ డీ చేసిన బవా కీర్తికిరీటంలో ఇలాంటి అవార్డులెన్నో ఉన్నాయి.

  • Loading...

More Telugu News