: 'కొసదాకా కొట్లాడు బిడ్డా' అని కాళోజీ ఆశీర్వదించారు: కేసీఆర్
'కొసదాకా కోట్లాడు బిడ్డా' అని కాళోజీ తనను ఆశీర్వదించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులోని రవీంద్రభారతలో కాళోజి శత జయంతి సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజాకవి కాళోజీ డబ్బుకు, పదవికి ఏనాడూ రాజీ పడలేదని కేసీఆర్ తెలిపారు. కాళోజీ సాహచర్యంతో ఎంతో స్పూర్తి పొందానని, జయశంకర్ సార్ కూడా ఆయన నుంచే స్పూర్తి పొందారని కేసీఆర్ వెల్లడించారు. మూడున్నర ఎకరాల్లో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేయడం కోసం 12 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నానని ఆయన తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం వరంగల్ నగరానికి వరం లాంటిదని, అందులో 1500 మంది కూర్చునేలా సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.